Half Day Schools: తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన.. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ అధికారిక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనున్నట్లు పేర్కొంది.
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం 12.30 గంటలకు అందించి ఇంటికి పంపనున్నారు.
వివరాలు
పరీక్షలకు ప్రత్యేక తరగతులు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు.
అయితే, ఎస్‌ఎస్‌సీ పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయని స్పష్టం చేశారు.
2024-25 విద్యా సంవత్సరంలో చివరి రోజు అయిన ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు అమలులో ఉంటాయని తెలియజేశారు.
ఈ మార్గదర్శకాలను అన్ని విద్యా సంస్థలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచనలు అందించామని వెల్లడించారు.