LOADING...
Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. తొలిసారిగా రెడ్ అలర్ట్ జారీ
తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. తొలిసారిగా రెడ్ అలర్ట్ జారీ

Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. తొలిసారిగా రెడ్ అలర్ట్ జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
May 25, 2026
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మండుతున్న ఎండలు, ఉక్కపోతతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వడగాల్పుల ప్రభావంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. అతి తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ తొలిసారిగా రెడ్ అలర్ట్ ప్రకటించింది.

వివరాలు 

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి తీవ్ర వడగాల్పులు నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ అమల్లో ఉంది. అలాగే కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో తీవ్ర వడగాల్పుల పరిస్థితులు ఉండొచ్చని హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement