Loading...
Telangana: తెలంగాణలో 11.72 లక్షల టన్నుల ధాన్యానికి ఈ-వేలం.. కనీస ధర రూ.2,389
తెలంగాణలో 11.72 లక్షల టన్నుల ధాన్యానికి ఈ-వేలం.. కనీస ధర రూ.2,389

Telangana: తెలంగాణలో 11.72 లక్షల టన్నుల ధాన్యానికి ఈ-వేలం.. కనీస ధర రూ.2,389

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 21, 2026
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో రైస్‌మిల్లులు, గోదాముల్లో నిల్వ ఉన్న 2025-26 రబీ సీజన్‌ దొడ్డురకం ధాన్యాన్ని విక్రయించేందుకు పౌరసరఫరాల సంస్థ ఈ-వేలానికి సిద్ధమైంది. మొత్తం సుమారు 17 లక్షల టన్నుల ధాన్యాన్ని విక్రయించాలని నిర్ణయించగా.. తొలిదశలో 11.72 లక్షల టన్నుల ధాన్యానికి బిడ్లు ఆహ్వానించింది. ఈ మేరకు ఆదివారం వేలం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 28న మధ్యాహ్నం 12 గంటలకు ఈ-వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

వివరాలు 

81 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

యాసంగి సీజన్‌లో పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి మొత్తం 81 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది.

అయితే అవసరాలకు మించి ధాన్యం నిల్వ ఉండటంతో.. గత జూన్‌లో 5 లక్షల టన్నుల సన్నధాన్యాన్ని విక్రయించేందుకు టెండర్లు పిలిచింది.

క్వింటాకు కనీస ధరను రూ.3,405గా నిర్ణయించింది. అయితే ఆ ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

సన్నబియ్యానికి ఉపయోగించాలని నిర్ణయం

దీంతో ఎల్‌నినో నేపథ్యంలో ఈ ధాన్యాన్ని పేదలకు పంపిణీ చేసే సన్నబియ్యం తయారీకి ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది.

తాజాగా రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు పౌరసరఫరాల సంస్థ దొడ్డురకం ధాన్యాన్ని ఈ-వేలం ద్వారా విక్రయించే ప్రక్రియను ప్రారంభించింది.

వివరాలు 

కనీస ధర రూ.2,389

ధాన్యం విక్రయ ధరకు సంబంధించి మూడు రకాల ప్రతిపాదనలు ప్రభుత్వానికి వచ్చాయి.

వాటిలో క్వింటాకు రూ.2,389ను కనీస ధరగా ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నెల 22న సివిల్‌ సప్లై భవన్‌లో ప్రీ-బిడ్‌ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

అనంతరం ఈ నెల 28న మధ్యాహ్నం 12 గంటలకు ఈ-వేలం జరుగుతుంది.

క్వింటాకు రూ.2,389 కంటే ఎక్కువ ధరను కోట్‌ చేసే బిడ్డర్‌కు సంబంధిత లాట్‌లోని ధాన్యాన్ని విక్రయించే అవకాశం ఉంటుంది.

వేలం ప్రక్రియలో గోదాముల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని ఒక్కో లాట్‌కు 50 వేల టన్నుల చొప్పున విభజించారు.

రైస్‌మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని ఒక్కో లాట్‌కు 15 వేల టన్నుల చొప్పున విభజించి ఈ-వేలం నిర్వహించనున్నారు.

ADVERTISEMENT