Telangana: తెలంగాణలో ఈ నెల 20 నుంచి భారీ వర్షాలు.. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఈ నెల 20 నుంచి 23 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని సూచించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్,నల్గొండ, సూర్యాపేట,మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ 'పసుపు' రంగు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నేడు,రేపు కూడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఈ నెల 19వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని తెలిపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలంగాణాలో ఎల్లుండి నుంచి దంచికొట్టనున్న వర్షాలు..
Weather Alert: ఎల్లుండి నుంచి దంచికొట్టనున్న వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!https://t.co/hxG1JUkNLE
— Newsmeter Telugu (@NewsmeterTelugu) September 18, 2026