LOADING...
Telangana: తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ..

Telangana: తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2026
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో భాగంగా పలు కీలక శాఖల్లో అధికారుల బాధ్యతలను మార్చింది. చేనేత,హస్తకళల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌ను ప్రభుత్వం నియమించింది. అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌కు బాధ్యతలు అప్పగించింది. అలాగే దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆమెకు అదనపు బాధ్యతలు కూడా కేటాయించింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (పొలిటికల్)ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్‌ను నియమించిన ప్రభుత్వం,మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించింది. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఎన్. శ్రీధర్‌ను నియమించింది. రాష్ట్ర అటవీ ప్రధాన సంరక్షణ అధికారిగా వినయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.

వివరాలు 

సీఎంవోలోనూ కీలక మార్పులు

ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో కూడా ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించింది. సీఎంవో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న బి. అజిత్‌రెడ్డిని ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవోగా బదిలీ చేసింది. అలాగే సీఎంవో ముఖ్య కార్యదర్శిగా ఎన్. శ్రీధర్‌కు బాధ్యతలు అప్పగించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మరో 13మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Advertisement