Page Loader
TELANGANA : గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ.. కొత్త తేదీలు ఇవే 
కొత్త తేదీలు ఇవే

TELANGANA : గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ.. కొత్త తేదీలు ఇవే 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 11, 2023
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీఎస్పీఎస్సీ గ్రూప్-2 ఉద్యోగ నియామక పరీక్ష మరోసారి వాయిదా పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎగ్జామ్ వాయిదా వేసినట్లు కమిషన్ ప్రకటించింది. నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను 2024 జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు వాయిదా వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ నిర్వహిస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ప్రకటన చేసింది. ఆగస్ట్ 29,30లో నిర్వహించాల్సిన పరీక్షలను అభ్యర్థుల అభ్యంతరాలను, భవిష్యత్ దృష్ట్యా నవంబర్ నెలకు వాయిదా వేశారు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో మరోసారి వాయిదా వేశారు. అంతకుముందు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో గ్రూప్‌-2 వాయిదా వేయాలని తీర్మానించారు.

details

గ్రూప్ పరీక్షలు - నవంబర్ 2, 3 కాదు జనవరి 6, 7 : కమిషన్

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 783 గ్రూప్‌-2 పోస్టులకు గానూ 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఓఎంఆర్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనుంది. గతంలో గ్రూప్‌-2 పరీక్ష నిర్వించాక డబుల్‌ బబ్లింగ్‌పై న్యాయవివాదాలు తలెత్తాయి. దీంతో ఫలితాల వెల్లడికి సుమారు రెండేళ్ల సమయం పట్టింది. ప్రస్తుతం గ్రూప్‌-2 నిర్వహణలో సమస్యలు లేకుండా, వివాద రహితంగా కమిషన్‌ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. తొలుత వీకెండ్ సెలవుల్లో పరీక్ష నిర్వహించాలని భావించినా, కేంద్ర ప్రభుత్వ పరీక్షల నేపథ్యంలో ఆగస్ట్ 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలకు కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అభ్యర్థుల సూచనతో నవంబర్ 2, 3కి వాయిదా పడింది. తాజాగా ఎన్నికల కారణంగా జనవరి 6, 7కి గ్రూప్ 2 వాయిదా పడింది.