
SCCL ELECTIONS : సింగరేణి ఎన్నికలు వాయిదా.. ఆదేశాలిచ్చిన హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ - SCCLలో కార్మిక గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు 28న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి.
అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో కార్మిక సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని అభ్యర్థిస్తూ సింగరేణి హైకోర్టును ఆశ్రయించింది.
ఈ క్రమంలోనే ఎన్నికలను ప్రస్తుతానికి వాయిదా వేస్తూ తిరిగి డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే నవంబర్ 30లోగా కార్మిక శాఖకు తుది ఎన్నికల జాబితా సమర్పించాలని సింగరేణికి సూచించింది.
ఇదే సమయంలో సింగరేణి ఎన్నికలకు తెలంగాణ సర్కారు సహకరించాలని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఎన్నికలకు సహకరిస్తామని గురువారం లోగా హామీ పత్రం ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
DETAILS
ఎన్నికల వాయిదాకు 13 సంఘాలు ఓకే
అక్టోబర్‌లోగా గుర్తింపు సంఘానికి ఎన్నికలు నిర్వహించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ సింగరేణి యాజమాన్యం, ఫుల్ బెంచ్ కు అప్పీల్ చేసింది.
అక్టోబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలన్న సింగిల్ జడ్డి ఉత్తర్వులను రద్దు చేయాలని అడగట్లేదని చెప్పిన సింగరేణి తరఫున లాయర్, గడువును మాత్రం పొడిగించాలని కోరారు.
ఇదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగమంతా అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ఉన్నారని, కలెక్టర్లు కూడా సహకరించలేమన్నారని కోర్టుకు తెలిపారు.
ఇలాంటి సందర్భంలో అక్టోబర్ నాటికే ఎన్నికలను నిర్వహించడం కష్టమన్నారు. 6 జిల్లాల్లో 15 యూనియన్లకు సంబంధించి దాదాపు 40 వేల మంది కార్మికులు ఉన్నారని న్యాయమూర్తులకు వివరించారు.
15లో 13 సంఘాలు వాయిదాకు అంగీకరించాయన్నారు. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.