Page Loader
సింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల బోనస్ బొనాంజ.. దసరాకి చెల్లిస్తామన్న సీఎం
సింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల బోనస్ బొనాంజ.. దసరాకి చెల్లిస్తామన్న సీఎం

సింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల బోనస్ బొనాంజ.. దసరాకి చెల్లిస్తామన్న సీఎం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 12, 2023
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్‌ బొనాంజా ప్రకటించింది. వార్షిక లాభాల్లో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ రూ.2184 కోట్ల లాభాలను వచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉద్యోగ, కార్మికులకు రూ.700 కోట్ల ప్రొడక్షన్ బోనస్ రాబోతోంది. ఈ నేపథ్యంలో తమ కష్టం తిరిగి తమను చేరనుందని ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగానే ఉద్యోగులు, కార్మికులకు లాభాల వాటాగా రూ.700 కోట్లు చెల్లిస్తామని ప్రకటించారు. దసరా నాడు ఈ బోనస్‌ అందుకుంటారని సీఎం కేసీఆర్‌ వెల్లడించడంతో ఉద్యోగులు సంతోషపడుతుండటం విశేషం.

DETAILS

ప్రస్తుతం ట‌ర్నోవ‌ర్‌ను రూ.33 వేల కోట్ల‌కు పెరిగింది : సీఎం కేసీఆర్

సింగరేణిలో ఏటా ప్రభుత్వం లాభాల బోనస్‌ పెంచుతూ వచ్చింది. ఈ మేరకు కార్మికులు గత 9 ఏళ్లలో 15 శాతం నుంచి గతేడాది 30 శాతం వరకు సాధించుకున్నారు. పూర్తి స్థాయి మస్టర్లు చేసుకున్న కార్మికులకు రమారమి లాభాల వాటాగా రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పొందే అవకాశం ఉందని అధికార వర్గాల అంచనా. తెలంగాణ వ‌చ్చిన కొత్తలో సింగ‌రేణి వార్షిక ట‌ర్నోవ‌ర్ కేవలం రూ.11 వేల కోట్లేనని గుర్తు చేసిన ముఖ్యమంత్రి, ప్రస్తుతం ట‌ర్నోవ‌ర్‌ను రూ.33 వేల కోట్ల‌కు పెరిగిందన్నారు. సంస్థలో లాభాలు రూ.300 నుంచి రూ.400 కోట్లు మాత్ర‌మే ఉండేదని, ప్రస్తుతం రూ. 2,184 కోట్లకు చేరుకుందన్నారు.