Page Loader
Telangana-VCK Pary-Tamil Party: తెలంగాణ బరిలో తమిళ పార్టీ వీసీకే పోటీ..మూడు సీట్లలో నామినేషన్లు దాఖలు
వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావల్

Telangana-VCK Pary-Tamil Party: తెలంగాణ బరిలో తమిళ పార్టీ వీసీకే పోటీ..మూడు సీట్లలో నామినేషన్లు దాఖలు

వ్రాసిన వారు Stalin
Apr 28, 2024
01:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Eletctions) నేపథ్యంలో తెలంగాణ (Telangana)లో తమిళ్ పార్టీ విడుతలై చిరుతైగల్ కట్చి (VCK party)పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తిరుమావల్ (Tirumaval) అధ్యక్షుడిగా ఉన్న వీసీకే పార్టీ తరఫున ఇప్పటికే నామినేషన్లు దాఖలు అయ్యాయి. సికింద్రాబాద్ (Secunderabad) లోక్ సభ నియోజకవర్గం నుంచి శ్యామ్ హైదరాబాదు (Hyderabad) లోక్ సభ నియోజకవర్గం నుంచి పద్మజా పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ పేర్కొంది. తమిళనాడులోని డీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకున్న వీసీకే పార్టీ తెలంగాణలో సింగల్ పార్టీగా బరిలో నిలుస్తోంది.

VCK Party-Telangana

40 ఏళ్లు దళిత బహుజనుల కోసం వీసీకే పోరాటాలు

తెలంగాణలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా ఉపసంహరణకు ఇంకా గడువుంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గం ఇప్పటికే నామినేషన్లు దాఖలు అయ్యాయి. కొంతమంది పార్టీల తరఫున పోటీ చేయగా మరి కొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా డీఎంకే పార్టీ వీసీకేకు రెండు సీట్లు కేటాయించింది కాగా దళిత బహుజనల కోసం ఈ వీసీకే పార్టీ గత 40 ఏళ్లుగా తమిళనాడులో పోరాటాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.