
Bengal: భార్యాబిడ్డలను హత్యచేసి.. ఉరేసుకుని ఆత్మహత్య!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని వారి అపార్ట్‌మెంట్‌లో ఆదివారం ఒక కుటుంబానికి చెందిన నలుగురు సభ్యుల కుళ్ళిపోయిన మృతదేహాలను కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు.
బృందాబన్ కర్మాకర్ (52)గా గుర్తించిన వ్యక్తి మొదట తన కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపి ఆపై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగువారు ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు ఖర్దాలోని ఎంఎస్ ముఖర్జీ రోడ్‌లోని అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు.
అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లేందుకు తలుపులు పగులగొట్టగా ఆ ఫ్లాట్ లో నలుగురి మృతదేహాలు కనిపించాయి.
కర్మాకర్ మృతదేహం పైకప్పుకు వేలాడుతూ కనిపించగా,అతని కుటుంబ సభ్యుల మృతదేహాలు భార్య దేబశ్రీ,17ఏళ్ల కుమార్తె దేబలీనా,8ఏళ్ళ కుమారుడు ఉత్సాహా ఫ్లాట్‌లోని వేర్వేరు ప్రదేశాలలో దొరికినట్టు పోలీసులు చెప్పారు.
Details
పోలీసులకు కాల్ చేసిన కౌన్సిలర్
భవనంలో నీటి పంపును నిర్వహించే వ్యక్తి తాళాల గుత్తి కోసం కర్మాకర్ ఫ్లాట్‌కు వెళ్లి డోర్‌బెల్ మోగించినా సమాధానం రాకపోవడమే కాకుండా ఆ ఫ్లాట్ నుండి కూడా దుర్వాసన రావడం గమనించి స్థానిక కౌన్సిలర్‌కు సమాచారం ఇచ్చాడు.
కౌన్సిలర్ పోలీసులకు కాల్ చెయ్యడంతో వారు ఫ్లాట్ తలుపులు పగలగొట్టి, నాలుగు మృతదేహాలను కనుగొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,ఫ్లాట్ లో లభించిన సూసైడ్ నోట్ ప్రకారం మృతుడు కర్మాకర్ భార్యకు వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని, తెలిసి ఈ చర్యకు పూనుకున్నట్లు రాసుంది.
ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించి తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.