Page Loader
Numaish: హైదరాబాద్‌లో నుమాయిష్‌ ప్రారంభం వాయిదా.. జనవరి 3న ప్రారంభం
హైదరాబాద్‌లో నుమాయిష్‌ ప్రారంభం వాయిదా.. జనవరి 3న ప్రారంభం

Numaish: హైదరాబాద్‌లో నుమాయిష్‌ ప్రారంభం వాయిదా.. జనవరి 3న ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2024
05:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరగాల్సిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) బుధవారం (జనవరి 1) ప్రారంభం కావాల్సి ఉండగా, మాజీ ప్రధాని సంతాప దినాల కారణంగా జనవరి 3కు వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం, నుమాయిష్‌ జనవరి 1న ప్రారంభమై 46 రోజుల పాటు, అంటే ఫిబ్రవరి 15 వరకు జరగాల్సి ఉంది. పారిశ్రామిక ప్రదర్శన నిర్వహణలో ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షులు, మంత్రి శ్రీధర్‌ బాబు పర్యవేక్షణలో ఉపాధ్యక్షుడు నిరంజన్‌, కార్యదర్శి సురేందర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి మోహన్‌, కోశాధికారి డాక్టర్‌ ప్రభాశంకర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 2500 స్టాళ్ల నిర్మాణానికి నిర్వాహకుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతో స్టాళ్ల కేటాయింపు చివరి దశకు చేరుకుంది.

Details

దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు

నుమాయిష్‌కు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి కలిగి ఉండగా, ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది సందర్శకులు దీనిని సందర్శిస్తారు. పలు పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థల స్టాళ్లు, ఫుడ్‌ కోర్టులు, సందర్శకులను ఆకట్టుకునేందుకు అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ వంటి అనేక ప్రత్యేక ఆకర్షణలు అందుబాటులో ఉంటాయి. ప్రదర్శన సందర్భంగా సందర్శకుల కోసం పలు రకాల సేవలు, సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో, ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.