National Highways: తెలంగాణలో 1,767 కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు
తెలంగాణ రాష్ట్రం రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే అనేక కొత్త రహదారుల నిర్మాణం జరుగుతున్నా కొన్ని కీలక రహదారుల విస్తరణ కూడా చేపట్టారు. హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారితో పాటు, ఇతర ముఖ్య రహదారుల విస్తరణ పనులపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ కేంద్రంతో సహకారం పొందుతోంది. ఈ విస్తరణకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన విషయం కూడా ఉంది. అయితే రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందడుగు వేస్తూ, కొన్ని కీలక రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని కసరత్తు చేస్తోంది.
16 ప్రాంతాలు జాతీయ రహదారులుగా
రాష్ట్ర అభివృద్ధి పురోగతిలో రహదారుల ప్రాధాన్యం గమనిస్తూ, ఈ మార్పులను పూనుకుంది. ఇందులో భాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 1,767 కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ రోడ్ల సమాచారాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా సిద్ధం చేసి, త్వరలో కేంద్రానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ ఆలయాలను కలిపేలా ఈ రోడ్లను డిజైన్ చేశారు. రహదారులు పూర్తియైన తర్వాత ప్రాంతాల మధ్య వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా అందించనుంది. తద్వారా అభివృద్ధి వేగవంతంగా జరిగిపోతుంది.
జాతీయ రహదారులుగా మారే రహదారులు ఇవే
1. చౌటుప్పల్ (ఎన్‌హెచ్-65)-అమనగల్లు - షాద్ నగర్-సంగారెడ్డి (ఎన్‌హెచ్-65) 2. పుల్లూరు (ఎన్‌హెచ్-44) - అలంపూర్ - జెట్‌ప్రోల్-పెంట్లవల్లి - కొల్లాపూర్-లింగాల-అచ్చంపేట - డిండి (ఎన్‌హెచ్-765) - దేవరకొండ (ఎన్‌హెచ్-167) - మల్లేపల్లి - నల్గొండ (ఎన్‌హెచ్-565) 3. భువనగిరి (ఎన్‌హెచ్-163) - చిట్యాల (ఎన్‌హెచ్-65) 4. మరికల్ (ఎన్-167) - నారాయణపేట - రాంసముద్ర (ఎన్-150) 5. భూత్పూర్ - నాగర్ కర్నూల్ - మన్ననూర్ - మద్దిమడుగు - గంగాలకుంట - శ్రీగిరిపాడు 6. పెద్దపల్లి - కాటారం (ఎన్‌హెచ్-353సీ) 7. వనపర్తి - కొత్తకోట - గద్వాల - మంత్రాలయం (ఎన్‌హెచ్-167) 8. మన్నెగూడ (ఎన్‌హెచ్-163) - వికారాబాద్ - తాండూరు - జహీరాబాద్ - బీదర్ (ఎన్‌హెచ్-50)
రహదారులు
9. ఎర్రవల్లి చౌరస్తా (ఎన్‌హెచ్-44) - గద్వాల - రాయచూరు (ఎన్‌హెచ్-167) 10. జగిత్యాల (ఎన్‌హెచ్-63) - పెద్దపల్లి - కాల్వశ్రీరాంపూర్ - కిష్టంపేట - కాల్వపల్లి - మోరంచపల్లి - రామప్ప దేవాలయం - జంగలపల్లి (ఎన్‌హెచ్-163) 11. సారపాక (ఎన్‌హెచ్-30) - ఏటూరునాగారం (ఎన్‌హెచ్-163) 12. కరీంనగర్ (ఎన్‌హెచ్-563) - రాయపట్నం (ఎన్‌హెచ్-63) 13. కరీంనగర్ (ఎన్‌హెచ్ 563 కూడలి) - సిరిసిల్ల - కామారెడ్డి - ఎల్లారెడ్డి - పిట్లం(ఎన్‌హెచ్161) 14. సిరిసిల్ల (ఎన్‌హెచ్ 65బీ) - వేములవాడ - కోరుట్ల 15. దుద్దెడ (ఎన్‌హెచ్-365బీ) - కొమురవెల్లి - యాదగిరిగుట్ట - రాయగిరి చౌరస్తా 16. జగ్గయ్య పేట (ఎన్‌హెచ్-65) - వైరా - కొత్తగూడెం (ఎన్‌హెచ్-30)