కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రారంభించేందుకు లోక్‌సభ సచివాలయాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.
రాష్ట్రపతిని పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించకుండా కేంద్ర ప్రభుత్వం అవమానించిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, ఈ పిల్‌ను ఎందుకు దాఖలు చేశారో తమకు తెలుసునని ధర్మాసనం తెలిపింది.
దీనిని స్వీకరించడానికి తాము సిద్ధంగా లేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. అంతేకాకుండా ఈ పిటిషన్ విషయంపై జరిమానా విధించినందుకు కృతజ్ఞతతో ఉండమని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్‌ను సున్నితంగా హెచ్చరించింది.
సుప్రీంకోర్టు
కొత్త పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించడంపై ప్రతిపక్షాల అభ్యంతరం
మే 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో రాజకీయ దుమారానికి కారణమైంది.
రాష్ట్రపతిని పక్కన పెట్టడాన్ని నిరసిస్తూ దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి.
ఈ క్రమంలో కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి సంబంధించి లోక్‌సభ సెక్రటరీ జనరల్ జారీ చేసిన ఆహ్వానం రాజ్యాంగ ఉల్లంఘనేనని, రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది జయ సుకిన్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.