'ది కేరళ స్టోరీ'పై బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధంపై సుప్రీంకోర్టు స్టే
'ది కేరళ స్టోరీ' సినిమా ప్రదర్శనను నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మే 8న జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంటే పశ్చిమ బెంగాల్‌లోని థియేటర్లలో ఇప్పుడు సినిమాను ప్రదర్శించవచ్చు. 'ది కేరళ స్టోరీ' సినిమాకు సుదీప్తో సేన్ దర్శక్వతం వహించారు. కేరళలో 2018-2019లో ఇస్లాం మతంలోకి మారిన ముగ్గురు అమ్మాయిలపై జరిగిన అణచివేత ఆధారంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. విడుదలైన తొలి రోజు నుంచి ఈ సినిమా రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువైంది. ముఖ్యంగా బీజేపీ ఈ సినిమాను మరింత ప్రమోట్ చేయడంతో దీనిపై చర్చ ఇంకా ఎక్కువైంది. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఈ సినిమాకు రాయితీలు ఇస్తుండటం గమనార్హం.