Assembly Budget Session: అసెంబ్లీలో మూడో రోజు చర్చలు.. ఐదు బిల్లులపై కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి ప్రారంభం కానున్నాయి.
ప్రశ్నోత్తరాల అనంతరం బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత బిల్లు సహా ఐదు బిల్లులు శాసనసభలో ప్రవేశపెట్టనున్నాయి.
అయితే మండలిలో ప్రశ్నోత్తరాలకే పరిమితం కానున్నది.
Details
శాసనసభలో చర్చకు వచ్చే ముఖ్య అంశాలు
మెస్ డైట్ చార్జీల పెంపు
జాతీయ రహదారుల సమీపంలో ట్రామా కేర్ కేంద్రాల ఏర్పాటుపై చర్చ
విదేశీ ఉపకార వేతనాల చెల్లింపులో జాప్యం
కామారెడ్డి జిల్లాలో పర్యాటక అభివృద్ధి
దేవాలయ పర్యాటక ప్రోత్సాహం, పర్యావరణ పర్యాటక ప్రోత్సాహం
హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంపై చర్చ
ప్రభుత్వ వెబ్‌సైట్లలో జీవోలు, సర్క్యులర్ల ప్రదర్శన
హెచ్ఎండీఏ భూముల తాకట్టు
మహబూబాబాద్ పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి నిధులు
టీ-ప్రైడ్ పథకం కింద రాయితీపై చర్చ
Details
మండలిలో చర్చకు వచ్చే ముఖ్య అంశాలు
ప్రభుత్వ పథకాల అమలు
కళ్యాణమస్తు పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు
సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పురోగతి
రంగారెడ్డి జిల్లాలో ఫార్మసిటీ కోసం భూసేకరణ
రాష్ట్రంలో విత్తన ఉత్పత్తి, వరి ధాన్యానికి బోనస్
తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ
వరి ధాన్యం సేకరణపై చర్చ
తుమ్మడిహట్టి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటి సరఫరా
Details
బిల్లుల ప్రవేశపెట్టడం, ఆమోద ప్రక్రియ
ప్రశ్నోత్తరాల ముగిసిన తర్వాత ఎస్సీ వర్గీకరణ రేషనలైజేషన్ బిల్లును సీఎం రేవంత్ ప్రవేశపెడతారు.
చర్చ అనంతరం బిల్లు ఆమోదం కోసం కోరనున్నారు.
బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్న ప్రభాకర్ ప్రవేశపెడతారు.
గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో **బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును కూడా ప్రవేశపెడతారు.
తెలంగాణ చారిటబుల్, హిందూ సంస్థల సవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి సభలో చర్చ ప్రారంభిస్తారు.
ఆయా బిల్లులపై చర్చించి ఆమోదం కోసం కోరనున్నారు.