Loading...
Hyderabad PRTS Project: హైదరాబాద్‌లో పీఆర్‌టీఎస్‌కు ముందడుగు.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్‌ ఆమోదం
హైదరాబాద్‌లో పీఆర్‌టీఎస్‌కు ముందడుగు.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్‌ ఆమోదం

Hyderabad PRTS Project: హైదరాబాద్‌లో పీఆర్‌టీఎస్‌కు ముందడుగు.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్‌ ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 12, 2026
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో ప్రజారవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పర్సనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (పీఆర్‌టీఎస్‌)ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రతిపాదించిన నాలుగు కారిడార్లలో మూడింటికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రాథమికంగా అంగీకారం తెలిపారు. మరో మార్గానికి సంబంధించి ప్రతిపాదనలను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. నగరంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న మెట్రో రైలు,ఎంఎంటీఎస్‌, ఆర్టీసీ వంటి ప్రజారవాణా వ్యవస్థలకు అనుసంధానంగా పీఆర్‌టీఎస్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వ్యవస్థకు సంబంధించి నాలుగు కారిడార్లపై అధ్యయనం చేసే బాధ్యతలను లీ అసోసియేట్స్‌ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ సమర్పించిన నివేదికను ఇటీవల సీఎం పరిశీలించారు. రాయదుర్గం-కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ-రాయదుర్గం నాలెడ్జి సిటీ, కొండాపూర్‌-ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ కారిడార్లకు ఆయన ప్రాథమికంగా అంగీకారం తెలిపారు.

వివరాలు 

ఆదాయం కంటే ప్రయాణికుల భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం

నాలుగో కారిడార్‌ను అసెంబ్లీ,లక్డీకాపూల్‌, సచివాలయం, ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాలను కలుపుతూ ప్రతిపాదించారు.

అయితే ఈ మార్గాన్ని మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు.

ఈ కారిడార్‌ను రాణిగంజ్‌ వరకు అనుసంధానించే అవకాశాలను కూడా పరిశీలించాలని అధికారులకు తెలిపారు.

అయితే ఈ మార్గంలో రైల్వే ట్రాక్‌ ఉండటం వంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశాలపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది.

పీఆర్‌టీఎస్‌ నిర్మాణానికి కిలోమీటరుకు సుమారు రూ.120 కోట్ల నుంచి రూ.180 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ ప్రాజెక్టులో అత్యంత సురక్షితమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఆదాయం కంటే ప్రయాణికుల భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

వివరాలు 

ఆదాయం కంటే ప్రయాణికుల భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం

సీఎం ప్రాథమికంగా అంగీకరించిన మూడు కారిడార్లలో ఏ మార్గాన్ని ఎంపిక చేస్తే ఎక్కువ మంది ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందనే అంశాన్ని సంబంధిత ఏజెన్సీ అధ్యయనం చేయనుంది.

ప్రతి కారిడార్‌కు సంబంధించి మూడు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఈ సంస్థ ప్రతిపాదించనుంది.

వాటిని పరిశీలించిన తర్వాత ఆయా మార్గాల ఎంపికపై తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

మరోసారి జీసీ గడువు పొడిగింపు

మరోవైపు, పాతబస్తీతో పాటు మొత్తం నాలుగు మెట్రో రైలు కారిడార్ల పర్యవేక్షణకు సంబంధించి జనరల్‌ కన్సల్టెన్సీ (జీసీ) నియామకానికి పిలిచిన టెండర్ల గడువును హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రైలు అధికారులు మరోసారి పొడిగించారు.

మొదటిసారి పొడిగించిన గడువు అక్టోబరు 8తో ముగిసింది.

అయితే అప్పటివరకు టెండర్లకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో అధికారులు మరోసారి గడువు పెంచారు.

తాజా నిర్ణయం ప్రకారం టెండర్లు సమర్పించేందుకు ఈ నెల 22 వరకు అవకాశం కల్పించారు.

ADVERTISEMENT