Tirumala: తిరుపతి లడ్డూ.. సిట్ దర్యాప్తు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం
తిరుపతి లడ్డూలను తయారు చేసేందుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిశోధన బృందం (సిట్) దర్యాప్తును అక్టోబరు 3న జరిగే తదుపరి సుప్రీంకోర్టు విచారణ వరకు నిలిపివేసింది. సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీసిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగించారని నిరూపణ లేకుండా ప్రభుత్వ వాదనలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై చర్చనీయాంశమైంది. దర్యాప్తు సమగ్రతను నిర్ధారించేందుకు 'ముందు జాగ్రత్త చర్య'గా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రా టాప్ కాప్ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
ఆరోపణలు ఖండించిన మాజీ సీఎం
'సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం విచారణను నిలిపివేసామని ఆయన అన్నారు. ఈ వారం ప్రారంభంలో సిట్ తిరుమలలోని పిండి మిల్లును తనిఖీ చేసింది. ఈ కేసుపై సెప్టెంబర్ 25న ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, సెప్టెంబర్ 26న సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. అయితే, తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీకి కలుషితమైన నెయ్యి ఉపయోగించినట్లు ప్రాథమికంగా నిరూపించడానికి ఏమీ లేదని పేర్కొన్న సుప్రీంకోర్టు సోమవారం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గత వైఎస్సార్‌సీపీ హయాంలో లడ్డూల తయారీలో పందికొవ్వు, చేపనూనె ఉన్నట్లు ల్యాబ్ నివేదికను ఉటంకిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఖండించారు.