
Tomato: టమాటా ధరలు పతనం.. లబోదిబోమంటున్న రైతులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆకాశాన్ని అంటిన టమాట ధరలు ప్రస్తుతం పతనమయ్యాయి. ఆరుగాలం శ్రమించి రూ.లక్షలు ఖర్చు పెట్టి సాగు చేస్తే కనీసం పెట్టుబడులు కూడా రాలేదని రైతులు లబోదిబోమంటున్నారు.
ధరలు పడిపోవడంతో అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తెగుళ్లు సోకి, ఊజీ ప్రబలడంతో దిగుబడులు బాగా తగ్గాయి.
పుంగునూరులో 15కిలోల బాక్స్ జూన్‌లో రూ.800 నుంచి 1000 పలకగా, ప్రస్తుతం రూ.250 మాత్రమే పలుకుతోంది.
ఒక టమాటా సాగు చేయాలంటే కనీసం రూ.1.50 లక్షల నుంచి 2 లక్షలు ఖర్చు అవుతుంది. వాతావరణం సహకరిస్తే 15 నుంచి 19 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
Details
టమాటాతో నష్టపోతున్న రైతులు
ఇక ఎగుమతులు, దిగుమతులు లెక్కిస్తే ఒక్కో బాక్సుకు రూ.40 ఖర్చు అవుతుంది. ఒక్కో బాక్సుకు కమీషన్ రూ. 10 ఇవ్వాల్సిందే. ఇలా అన్ని ఖర్చులు భరించినా చివరికి రైతులకు నష్టమే మిలుగుతుంది.
మే, జూన్‌లో ధరలు బాగా ఉండటంతో రైతులు ఆధికంగా టమాటా పంట సాగు చేశారు.
ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల్లో పంట లేక అక్కడి వ్యాపారులు ఇక్కడికి రావడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు.
చెన్నై, వేలూరు, విజయవాడ, మదురై వ్యాపారులు రావడంతో ఇక్కడ సరకు అమ్ముడుపోక తక్కువ ధరకే ఇవ్వాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.