Loading...
Delhi traders: ఇండియా కూటమి ర్యాలీతో దెబ్బతిన్న ఢిల్లీ వ్యాపారాలు.. రూ.11 వేల కోట్ల నష్టం.. ఎవరు చెల్లిస్తారన్న వ్యాపార సంఘాలు
ఎవరు చెల్లిస్తారన్న వ్యాపార సంఘాలు

Delhi traders: ఇండియా కూటమి ర్యాలీతో దెబ్బతిన్న ఢిల్లీ వ్యాపారాలు.. రూ.11 వేల కోట్ల నష్టం.. ఎవరు చెల్లిస్తారన్న వ్యాపార సంఘాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 02, 2026
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజధాని దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిన్న ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీ కారణంగా తమకు రూ.11 వేల కోట్ల మేర వ్యాపార నష్టం వాటిల్లిందని ఢిల్లీ వ్యాపార సంఘాలు ఆరోపించాయి. పండుగల సీజన్‌లో ర్యాలీ నిర్వహించడం వల్ల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ఆవేదన వ్యక్తం చేసింది. సీటీఐ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ మాట్లాడుతూ.. ర్యాలీ కారణంగా ఢిల్లీకి ప్రత్యక్షంగా రూ.11 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామని తెలిపారు. ఇందులో రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలకు రూ.8,800 కోట్లు, రవాణా, లాజిస్టిక్స్ రంగాలకు రూ.1,500 కోట్లు, హాస్పిటాలిటీ, పర్యాటక రంగాలకు రూ.500 కోట్ల నష్టం జరిగినట్లు వివరించారు.

వివరాలు 

ఉపాధి కోల్పోయిన 20లక్షల మంది రోజువారీ కార్మికులు,వీధి వ్యాపారులు

ర్యాలీ కారణంగా రామ్‌లీలా మైదానానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రధాన మార్కెట్లలో వ్యాపారాలు నిలిచిపోయాయని సీటీఐ పేర్కొంది.

చాందినీ చౌక్,కన్నాట్ ప్లేస్,కరోల్ బాగ్,సదర్ బజార్ వంటి మార్కెట్లలో సుమారు 2.5లక్షల దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయని తెలిపింది.

దుకాణాలు మూతపడటంతో దాదాపు 20లక్షల మంది రోజువారీ కార్మికులు,వీధి వ్యాపారులు ఉపాధి కోల్పోయారని సీటీఐ వెల్లడించింది.

ఈ వర్గాలకు సుమారు రూ.200కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. మరోవైపు,వ్యాపార సంఘాల ఆరోపణలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.

బీజేపీ ప్రభుత్వమే బలవంతంగా దుకాణాలను మూయించిందని ఆయన ఆరోపించారు.

ర్యాలీకి వచ్చిన వారు స్థానిక వ్యాపారులకు మద్దతుగా షాపింగ్ చేయాలని తాము కోరామని, అయితే బీజేపీ ప్రభుత్వం అన్ని దుకాణాలను మూసివేయించిందని ఓ వీడియోలో విమర్శించారు.

ADVERTISEMENT