
Kamareddy: కామారెడ్డిలో విషాదం.. చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో పండగ రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఊరి చివర్లో ఉన్న చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి చెందారు.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు మౌనిక (26), ఆమె కుమార్తె మైథిలి (10), కుమారులు వినయ్ (7), అక్షర (9)గా గుర్తించారు. అయితే మౌనిక మృతదేహం మాత్రం ఇంకా లభ్యం కాలేదు.
ప్రమాదం ఎలా జరిగిందంటే
మౌనిక పండగ రోజున తన పిల్లలతో కలిసి ఊరి చివర చెరువు వద్ద బట్టలు ఉతకడానికి వెళ్లింది.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అందరూ చెరువులో పడ్డారు. విషయం తెలుసుకున్న మౌనిక కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Details
పోలీసుల విచారణ
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
మౌనిక మృతదేహాన్ని వెలికితీయడానికి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో పండగ ఆనందం ఒక్కసారిగా విషాదఛాయలకు లోనైంది. గ్రామంలో పెను విషాదం నెలకొంది.