Loading...
Mamata Banerjee: మమతా బెనర్జీ కుటుంబంలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో మేనకోడలు మృతి!
మమతా బెనర్జీ కుటుంబంలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో మేనకోడలు మృతి!

Mamata Banerjee: మమతా బెనర్జీ కుటుంబంలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో మేనకోడలు మృతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ మేనకోడలు బ్రిస్టీ ముఖర్జీ (28) మృతి చెందారు. బీర్భూమ్ జిల్లాలోని తన ఇంట్లో మంగళవారం ఆమె మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఆమె మృతిని ప్రాథమికంగా ఆత్మహత్య కేసుగా పరిగణిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రాంపూర్‌హాట్ ప్రాంతంలోని కుసుంబా గ్రామంలో ఉన్న బ్రిస్టీ ఇంటి రెండో అంతస్తులోని ఓ గదిలో ఆమె ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్రిస్టీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

వివరాలు

దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు

ఆమె మృతికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. పోస్టుమార్టం నివేదికతో పాటు ఇతర న్యాయపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు.

కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. బ్రిస్టీ కొంతకాలంగా విడాకుల సమస్యను ఎదుర్కొంటున్నారు.

కొన్ని సంవత్సరాలుగా ఆమె డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. బ్రిస్టీ తండ్రి నిహార్ ముఖర్జీ.. మమతా బెనర్జీకి మేనమామ వైపు బంధువు (మాతృ సంబంధీకుడు) కాగా, స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు.

ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ADVERTISEMENT