
Pahalgam Terror Attack: హనీమూన్‌లో విషాదం.. కళ్లముందే భర్తను కోల్పోయిన నవ వధువు
ఈ వార్తాకథనం ఏంటి
నిండునూరేళ్లు కలిసి బతకాలని పెళ్లి కలలు కన్న వారు కలలు క్షణాల్లోనే అవిరయ్యాయి.
హనీమూన్‌కు వెళ్లిన నూతన దంపతుల జీవితాల్లో ఉగ్రవాదులు విషాన్ని చిమ్మేశారు.
పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు కొత్తగా పెళ్లైనవారే. వారిలో ఒకరు నౌకాదళ అధికారి కావడం హృదయ విదారకంగా మారింది.
కళ్లముందే తన భర్తను కాల్చిచంపిన దృశ్యాన్ని చూసిన నవ వధువు రోదన అందరి హృదయాలను కదిలించింది.
Details
పెళ్లైన ఆరు రోజుల్లోనే విషాదం
హరియాణాకు చెందిన 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ రెండు సంవత్సరాల క్రితమే నౌకాదళంలో చేరారు.
కేరళలోని కోచిలో విధులు నిర్వహిస్తున్న ఆయన ఏప్రిల్ 16న వివాహమాడగా, 19న అతిథుల కోసం విందు ఏర్పాటు చేశారు. అనంతరం భార్యతో కలిసి హనీమూన్ టూర్‌లో భాగంగా కశ్మీర్ వెళ్లారు.
మంగళవారం పహల్గాంలో చోటుచేసుకున్న ఉగ్రదాడిలో వినయ్ ప్రాణాలు కోల్పోయారు.
ఆయన మృతదేహం పక్కన కూర్చొని విలపిస్తున్న భార్య దృశ్యం అందరినీ కన్నీటి పర్యంతం చేసింది.
Details
భర్తను కళ్లెదుటే తలపై కాల్చి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన శుభమ్ ద్వివేది ఫిబ్రవరి 12న వివాహం చేసుకున్నారు.
ఉద్యోగరీత్యా బిజీగా ఉన్న ఆయన ఇటీవలే తన భార్యను కశ్మీర్ వెకేషన్‌కు తీసుకెళ్లారు.
అక్కడే మంగళవారం జరిగిన కాల్పుల్లో ఆయన మృతి చెందారు.
శుభమ్ భార్య తెలిపిన వివరాల ప్రకారం, దాడికి ముందు ముష్కరులు వారి పేర్లు ఒక్కొక్కరిగా అడిగి, అనంతరం తలపై కాల్చి చంపారని చెప్పారు.
Details
మిగతా బాధితులు వీరే
ఈ దాడిలో ఒడిశాకు చెందిన అకౌంట్స్ అధికారి ప్రశాంత్ సత్పతీ, గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన శైలేష్ కడతియా కూడా ప్రాణాలు కోల్పోయారు.
వీరిద్దరూ కూడా తమ భార్య, పిల్లలతో కలిసి కశ్మీర్‌కు వెకేషన్ కోసం వెళ్లినవారే. ప్రశాంత్ కుటుంబ సభ్యుల ప్రకారం, ఆయన భార్య, కుమారుడి వివరాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు.
శైలేష్‌కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారని సమాచారం. ఈ ఉగ్రవాద దాడి నిర్ఘాంతవాన్ని కలిగించగా, బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.