LOADING...
Bus caught fire: నందిగామ సమీపంలో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం
నందిగామ సమీపంలో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

Bus caught fire: నందిగామ సమీపంలో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2026
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ సమీపంలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు 39 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కంచికచర్ల మండలంలోని కేసర టోల్‌గేట్‌ వద్ద బస్సు వెనక భాగంలోని ఇంజిన్‌ నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో డ్రైవర్‌ అప్రమత్తమయ్యాడు. వెంటనే బస్సును రోడ్డుపక్కన ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ సూచనలతో ప్రయాణికులంతా తక్షణమే బస్సు నుంచి దిగిపోయి సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement