TSPSC: 563 పోస్టుల భర్తీకి గ్రూప్-I నోటిఫికేషన్ విడుదల
వివిధ ప్రభుత్వ శాఖలలో 563పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ (TSPSC) సోమవారం విడుదల చేసింది. తద్వారా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారిగా నోటిఫై చేసిన గ్రూప్-I నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఏప్రిల్, 2022లో అప్పటి BRS ప్రభుత్వం 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన తాజా ప్రభుత్వం.. అనదనంగా మరో 60పోస్టులను కలిపి మొత్తం 563 పోస్టుల భర్తీకి TSPSC తాజాగా నోటిఫికేషన్‌ను తీసుకొచ్చింది. కొత్త నోటిఫికేషన్ ప్రకారం, గ్రూప్-I సేవల కోసం వివిధ కేటగిరీల పోస్టుల కోసం ఫిబ్రవరి 23- మార్చి 14వరకు కమిషన్ వెబ్‌సైట్ (www.tspsc.gov.in)లో అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.