Page Loader
గ్రూప్‌-2 కొత్త షెడ్యూల్ రిలీజ్.. నవంబర్‌ తొలి వారంలోనే పరీక్షలు
గ్రూప్‌-2 కొత్త షెడ్యూల్ రిలీజ్.. ఇక నవంబర్‌ తొలివారంలోనే పరీక్షలు

గ్రూప్‌-2 కొత్త షెడ్యూల్ రిలీజ్.. నవంబర్‌ తొలి వారంలోనే పరీక్షలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 13, 2023
06:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీఎస్పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షలను రీషెడ్యూల్‌ చేసింది. ఈ మేరకు నవంబర్ 2,3 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయాలని భారీ ఎత్తున అభ్యర్థులు కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో గ్రూప్ 2 పరీక్షలను రీషెడ్యూల్‌ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకు అనుగుణంగా టీఎస్పీఎస్సీతో పాటు సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. షెడ్యూల్‌ ప్రకారం ఆగస్ట్ 29, 30 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది. పలు నియామకాలకు వరుసగా పరీక్షలు నిర్వహిస్తున్న కారణంగా గ్రూప్‌-2కి సిద్ధమయ్యేందుకు వీలుగా వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పరీక్షల రీషెడ్యూల్‌ తేదీలను కమిషన్ ప్రకటించింది. 283 పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అభ్యర్థుల ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం