LOADING...
TGSRTC Recruitment 2026: తెలంగాణ ఆర్టీసీలో 198 ఉద్యోగాలు.. TSRTC TST, MST ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ ఇదే
TSRTC TST, MST ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ ఇదే

TGSRTC Recruitment 2026: తెలంగాణ ఆర్టీసీలో 198 ఉద్యోగాలు.. TSRTC TST, MST ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ ఇదే

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 23, 2026
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 198 ఖాళీలను భర్తీ చేయనున్న ఈ నియామకానికి సంబంధించిన రాత పరీక్ష హాల్ టికెట్లు తాజాగా విడుదలయ్యాయి. అభ్యర్థులు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

వివరాలు 

మార్చి 29న రాత పరీక్ష

ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (TST), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (MST) పోస్టుల భర్తీకి మార్చి 29న పరీక్ష నిర్వహించనున్నారు. ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు మధ్యాహ్నం 2.30 గంటలకు పరీక్ష ఉంటుంది. టీఎస్‌టీఎస్ పోస్టులకు 20,097 మంది, ఎంఎస్‌టీఎస్ పోస్టులకు 6,063 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

వివరాలు 

హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే విధానం

అభ్యర్థులు ఈ క్రింది విధంగా హాల్ టికెట్ పొందవచ్చు: ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.tgprb.in/ "Supervisor Trainees Recruitment 2025" విభాగంలో ఉన్న హాల్ టికెట్ లింక్‌పై క్లిక్ చేయాలి మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా వివరాలు నమోదు చేసి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది ప్రింట్ లేదా డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఉపయోగించి కాపీ సేవ్ చేసుకోవచ్చు పరీక్ష వివరాలు ఈ రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటలు. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు 84, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు 114 భర్తీ చేయనున్నారు.

Advertisement