Page Loader
Balakot: ఉగ్రవాదుల చొరబాటు విఫలం: ఎల్‌ఓసీ వద్ద ఇద్దరు ముష్కరులు హతం
ఉగ్రవాదుల చొరబాటు విఫలం: ఎల్‌ఓసీ వద్ద ఇద్దరు ముష్కరులు హతం

Balakot: ఉగ్రవాదుల చొరబాటు విఫలం: ఎల్‌ఓసీ వద్ద ఇద్దరు ముష్కరులు హతం

వ్రాసిన వారు Stalin
Aug 22, 2023
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటును భారత సైన్యం అడ్డుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు సైన్యం ప్రకటించింది. ఉగ్రవాదుల నుంచి ఒక ఏకే 47, రెండు మ్యాగజైన్‌లు, 30 రౌండ్లు, రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లు, పాకిస్థాన్‌కు చెందిన ఔషధాలతో సహా భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని సైన్యం వెల్లడించింది. బాలాకోట్ సెక్టార్ నుంచి భారత సరిహద్దులోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్న ఉగ్రవాదుల ఉనికిని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సైన్యంతోపాటు కశ్మీర్ పోలీసులకు అందించాయి. దీంతో సరిహద్దులో నిఘాను పెంచిన సైన్యం, ఇద్దురు ఉగ్రవాదులను హతమార్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం