Page Loader
జమ్ముకశ్మీర్: పుల్వామాలో ఎన్‌కౌంటర్‌; లష్కరే టాప్ లీడర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం 
జమ్ముకశ్మీర్: పుల్వామాలో ఎన్‌కౌంటర్‌; లష్కరే టాప్ లీడర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్: పుల్వామాలో ఎన్‌కౌంటర్‌; లష్కరే టాప్ లీడర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం 

వ్రాసిన వారు Stalin
Aug 21, 2023
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో ఒకరు లష్కరే తోయిబా టాప్ కమాండర్ అని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఉగ్రవాదుల మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. పుల్వామా జిల్లాలోని పరిగాం గ్రామంలో ఉగ్రవాదుల కదలికలపై ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం రావడంతో భద్రతా బలగాలు, పోలీసులు ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు తారసపడంతో లారో-పరిగాగ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైనట్లు కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరో ఉగ్రవాది పారిపోయినట్లు, అతనికోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు. రాజౌరీ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమైన రెండు వారాల తర్వాత ఇది ఈ ఘటన జరిగింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పరారీలో మరో ఉగ్రవాది