Ukraine: గిడ్డంగులు,చమురు కేంద్రాలే లక్ష్యంగా రష్యాలో భారీ డ్రోన్ దాడులు.. 9 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాలోని పలు నగరాల్లో ఉన్న చమురు క్షేత్రాలు,భారీ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ శనివారం విస్తృత స్థాయిలో డ్రోన్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా,60మందికిపైగా గాయపడినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. మాస్కోయుద్ధ సామర్థ్యాన్ని దెబ్బతీయాలనే వ్యూహంలో భాగంగా ఉక్రెయిన్..రష్యాలోని ఇంధన మౌలిక సదుపాయాలు,సైనిక స్థావరాలపై వరుసగా డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా మాస్కో,టాంబోవ్స్క్ ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ ఆన్లైన్ రిటైలర్ వైల్డ్బెర్రీస్కు చెందిన భారీగిడ్డంగులను లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్ దాడుల కారణంగా సుమారు 1.88లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఆ భారీ నిల్వ కేంద్రం పూర్తిగా అగ్నికి ఆహుతైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో అక్కడ భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రష్యాలో భారీ డ్రోన్ దాడులు.. గిడ్డంగులు, చమురు కేంద్రాలే లక్ష్యం
🇺🇦🇷🇺 Ukraine once again used drones to attack warehouses belonging to the company "Wildberries" (the "Russian Amazon") in the Moscow region, and also struck oil facilities. pic.twitter.com/kZEeQu1XkX
— Eli Afriat 🇮🇱 (@EliAfriatISR) July 20, 2026