Loading...
Sikkim: సిక్కింలో విరిగిపడిన కొండచరియలు.. 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!

Sikkim: సిక్కింలో విరిగిపడిన కొండచరియలు.. 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2026
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

సిక్కింలోని నామ్‌చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సమర్‌దుంగ్-మామరింగ్ టన్నెల్ వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 27 మంది కార్మికులు టన్నెల్‌లో చిక్కుకుపోగా, వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక బృందాలు యుద్ధప్రాతిపదికన చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు కార్మికులు మృతి చెందినట్లు జిల్లా యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. మృతదేహాలను సింగ్తం జిల్లా ఆసుపత్రి, గ్యాంగ్‌టాక్‌లోని ఎస్‌టీఎన్‌ఎమ్ (STNM) ఆసుపత్రి, నామ్‌చి జిల్లా ఆసుపత్రులకు తరలించారు.

వివరాలు 

టన్నెల్‌లో వ్యాపించిన ప్రమాదకరమైన మీథేన్ గ్యాస్

రెస్క్యూ ఆపరేషన్‌లో అధికారులకు ప్రధాన సవాలుగా టన్నెల్‌లో వ్యాపించిన ప్రమాదకరమైన మీథేన్ గ్యాస్ మారింది.

కొండచరియలు కూలిపోవడంతో భూమి, రాళ్ల పొరలు కదిలి గ్యాస్ బయటకు విడుదలై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

గ్యాస్ ప్రభావంతో సహాయక చర్యల్లో పాల్గొంటున్న కొందరు రెస్క్యూ సిబ్బందికి తల తిరగడం, మరికొందరు స్పృహ కోల్పోవడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.

అంతేకాకుండా టన్నెల్ మార్గం అత్యంత ఇరుకుగా ఉండటం,పొగమంచు లేదా దట్టమైన దుమ్ము కారణంగా దారి స్పష్టంగా కనిపించకపోవడం కూడా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది.

దీంతో రెస్క్యూ బృందాలు అత్యంత అప్రమత్తంగా ముందుకు సాగుతున్నాయి.

వివరాలు 

పూర్తిగా శిథిలాలతో మూసుకుపోయిన టన్నెల్ ప్రవేశ మార్గం

ప్రస్తుతం నామ్‌చి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఎన్‌హెచ్‌పీసీ (NHPC), ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF), ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), సిక్కిం పోలీసులు, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు.

అదే సమయంలో సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SSDMA) పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు జారీ చేస్తోంది.

కొండచరియలు విరిగిపడటంతో టన్నెల్ ప్రవేశ మార్గం పూర్తిగా శిథిలాలతో మూసుకుపోవడంతో, లోపల చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి రెస్క్యూ బృందాలు నిరంతరంగా శ్రమిస్తున్నాయి.

ADVERTISEMENT