Leander Paes: ఏఐటీఏ అధ్యక్ష రేసులో పేస్.. బీటీఏ కీలక నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
దిగ్గజ టెన్నిస్ ఆటగాడు 'లియాండర్ పేస్' అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేస్‌కు మద్దతుగా నిలవాలని బెంగాల్ టెన్నిస్ సంఘం (బీటీఏ) నిర్ణయించింది. ప్రస్తుతం పేస్ బీటీఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఏఐటీఏ అధ్యక్ష పదవికి ఇప్పటికే భారత డేవిస్ కప్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ పోటీలో ఉన్నాడు. అతను దిల్లీ లాన్ టెన్నిస్ సంఘం (డీఎల్‌టీఏ)కు నేతృత్వం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పేస్‌ను కూడా ఏఐటీఏ అత్యున్నత పదవికి పోటీలో నిలపాలని బీటీఏ సోమవారం తీర్మానించింది.
వివరాలు
తేదీని ఇంకా ఖరారు చేయలేదు
అయితే ఏఐటీఏ ఎన్నికలకు సంబంధించిన తేదీ ఇంకా ఖరారు కాలేదు.
ప్రస్తుతం ఏఐటీఏకు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న 'చింతన్ పరిఖ్' కూడా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో ఏఐటీఏ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.