Loading...
Germany: నాజీ యుగం తర్వాత తొలిసారి.. జర్మనీ రాష్ట్ర ఎన్నికల్లో ఫార్‌రైట్‌ పార్టీ విజయం
నాజీ యుగం తర్వాత తొలిసారి.. జర్మనీ రాష్ట్ర ఎన్నికల్లో ఫార్‌రైట్‌ పార్టీ విజయం

Germany: నాజీ యుగం తర్వాత తొలిసారి.. జర్మనీ రాష్ట్ర ఎన్నికల్లో ఫార్‌రైట్‌ పార్టీ విజయం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2026
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

జర్మనీ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సక్సోనీ-యాన్‌హాల్ట్‌ రాష్ట్రంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో ఫార్‌రైట్‌ పార్టీ 'ఆల్టర్నేటివ్‌ ఫర్‌ జర్మనీ' (ఏఎఫ్‌డీ) ఘన విజయం సాధించింది. నాజీ పాలన అనంతరం జర్మనీలోని కేంద్ర ప్రభుత్వం లేదా ఏదైనా రాష్ట్రంలో ఫార్‌రైట్‌ పార్టీ ఎన్నికల్లో గెలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అతిపెద్ద పార్టీగా ఏఎఫ్‌డీ ఈ ఎన్నికల ఫలితాలతో సక్సోనీ-యాన్‌హాల్ట్‌లో ఏఎఫ్‌డీ అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలిచింది. అయితే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీని మాత్రం సాధించలేకపోయింది. అధికార పగ్గాలు చేపట్టాలంటే మరో ముగ్గురు సభ్యుల మద్దతు ఆ పార్టీకి అవసరం.

వివరాలు 

బీఎస్‌డబ్ల్యూ మద్దతు కీలకం

ప్రస్తుత ఎన్నికల్లో ఐదు స్థానాలను కైవసం చేసుకున్న బీఎస్‌డబ్ల్యూ పార్టీ మద్దతు ఏఎఫ్‌డీకి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అదే జరిగితే రెండు పార్టీల కలయికతో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమయ్యే పరిస్థితి ఉంది.

ఏఎఫ్‌డీ, బీఎస్‌డబ్ల్యూ పార్టీలకు కొన్ని కీలక అంశాల్లో సారూప్యత ఉంది.

ముఖ్యంగా రష్యా విషయంలో ఈ రెండు పార్టీలు అనుకూల వైఖరిని ప్రదర్శిస్తుంటాయి. అలాగే జర్మనీలోకి వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

సీడీయూకు గట్టి ఎదురుదెబ్బ

ఏఎఫ్‌డీ విజయంపై జర్మనీ ఛాన్స్‌లర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ స్పందించారు.

తమ పార్టీ అయిన క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌ (సీడీయూ)కు ఈ ఫలితాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయని పేర్కొన్నారు.

అయినప్పటికీ సంస్కరణల విషయంలో తమ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని ఆయన స్పష్టం చేశారు.

ADVERTISEMENT