Sabalenka: యూఎస్ ఓపెన్‌లో సబలెంకా జోరు.. క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన టాప్ సీడ్
ఈ వార్తాకథనం ఏంటి
యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్, టాప్ సీడ్ అర్యానా సబలెంకా క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సబలెంకా 6-4, 6-3తో అమెరికా క్రీడాకారిణి టౌన్‌సెండ్‌ను ఓడించింది. తొలి సెట్‌లో సబలెంకాకు టౌన్‌సెండ్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అయితే ఆరో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన సబలెంకా 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత అదే ఆధిక్యాన్ని కొనసాగిస్తూ సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో టౌన్‌సెండ్ మరింత దూకుడుగా ఆడింది. ఒక దశలో 3-1తో ఆధిక్యంలో నిలిచి సెట్‌ను గెలిచేలా కనిపించింది. అయితే సబలెంకా ఒక్కసారిగా పుంజుకుని వరుసగా ఐదు గేమ్‌లను గెలిచింది.
వివరాలు
స్వైటెక్, గాఫ్ కూడా ముందంజ
దీంతో రెండో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది.
ఈ మ్యాచ్‌లో సబలెంకా రెండు ఏస్‌లు, 14 విన్నర్లు నమోదు చేసింది. ఎనిమిదో సీడ్ ఇగా స్వైటెక్ కూడా ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది.
పోలెండ్‌కు చెందిన స్వైటెక్ 7-6 (7-3), 7-6 (7-3)తో 25వ సీడ్ బౌజ్కోవా (చెకియా)ను ఓడించింది.
మ్యాచ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన స్వైటెక్.. 35 విన్నర్లు కొట్టింది.
నాలుగో సీడ్ కొకో గాఫ్ (అమెరికా) సైతం ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మూడో రౌండ్‌లో ఆమె 6-3, 6-4తో స్పెయిన్‌కు చెందిన క్రిస్టీనా బుసాపై విజయం సాధించింది.
వివరాలు
అలెగ్జాండ్రా ఏలా ఓటమి
మరోవైపు రెండో సీడ్ ఎలెనా రిబకినా (కజకిస్థాన్), ఐదో సీడ్ ఆండ్రీవా (రష్యా), 13వ సీడ్ నవోమి ఒసాకా (జపాన్) కూడా తదుపరి దశకు చేరుకున్నారు.
రిబకినా 7-6 (8-6), 6-3తో ఉక్రెయిన్ క్రీడాకారిణి స్ట్రొడట్‌త్సెవాను ఓడించింది. ఒసాకా 6-3, 3-6, 7-5తో బెల్జియం క్రీడాకారిణి మెర్టిన్స్‌పై గెలిచింది.
ఆండ్రీవా 6-2, 7-6 (7-5)తో చెకియాకు చెందిన బార్టున్‌కోవాపై పైచేయి సాధించింది. అమెరికా టీనేజర్ జోవిచ్ కూడా మూడో రౌండ్‌ను దాటింది.
ఆమె 7-5, 3-6, 7-5తో చెకియా క్రీడాకారిణి అలెగ్జాండ్రా ఏలాను ఓడించి ముందంజ వేసింది.
వివరాలు
ఫ్రిట్జ్‌కు షాక్
పురుషుల సింగిల్స్‌లో అమెరికా ఆటగాడు, తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌కు నిరాశ ఎదురైంది.
మూడో రౌండ్‌లో ఐదు సెట్ల పాటు సాగిన పోరులో అర్జెంటీనా ఆటగాడు సెరుండోలో చేతిలో అతడు ఓటమి పాలయ్యాడు.
సెరుండోలో 3-6, 4-6, 6-3, 6-4, 6-4తో ఫ్రిట్జ్‌ను ఓడించాడు. ఫ్రిట్జ్ ఐదు డబుల్‌ఫాల్ట్స్, 54 అనవసర తప్పిదాలు చేయడం అతడి ఓటమికి కారణమైంది.
మరోవైపు టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. జర్మనీ ఆటగాడు 6-2,7-6(7-2), 6-2తో చిలీకి చెందిన టాబిలోపై విజయం సాధించాడు.
ఈమ్యాచ్‌లో జ్వెరెవ్ 10 ఏస్‌లు, 44 విన్నర్లు నమోదు చేశాడు. బ్లాక్స్ (జర్మనీ), థియాన్ (అమెరికా), ఆర్థర్ (ఫ్రాన్స్), కచనోవ్ (రష్యా) కూడా మూడో రౌండ్‌ను దాటి ముందుకు సాగారు.
వివరాలు
అనిరుధ్ చంద్రశేఖర్‌కు తొలి రౌండ్‌లోనే ముగింపు
పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు అనిరుధ్ చంద్రశేఖర్ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది.
రష్యాకు చెందిన ఇవాన్ లిటర్‌విచ్‌తో కలిసి బరిలోకి దిగిన అనిరుధ్ జోడీ 4-6, 7-5, 4-6తో బ్రిటన్‌కు చెందిన ఫెరీ-పారిస్ జంట చేతిలో ఓటమి పాలైంది.