Uttarpradesh: 'లవ్ జిహాద్' బిల్లుకు యోగి సర్కార్ ఆమోదం
యూపీ అసెంబ్లీలో 'లవ్ జిహాద్ నిరోధక' బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో మోసపూరితంగా లేదా బలవంతంగా మతమార్పిడులు జరిగినప్పుడు చట్టం మరింత కఠినంగా మారుతుంది. ఈ చట్టం ప్రకారం దోషులను కఠినంగా శిక్షించే నిబంధన కూడా ఉంది. బిల్లు సవరించిన ప్రకారం మోసపూరిత వివాహాలు, ఇతర మార్గాల ద్వారా మతిమార్పిడికి పాల్పడే వారికి శిక్ష శిక్ష మరింత పెరగనుంది. ఇలాంటి వారికి యావజ్జీవ జైలుశిక్ష పడుతుంది. ఉత్తర్‌ప్రదేశ్ చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిషేధ (సవరణ) బిల్లు-2024ను వర్షాకాల సమావేశాల మొదటి రోజున UP అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
'లవ్ జిహాద్ ' బిల్లు అంటే ఏమిటి?
ఇప్పుడు ఈ బిల్లు ప్రకారం, ఎవరైనా వ్యక్తిని బెదిరించినా లేదా అతని ప్రాణం లేదా ఆస్తి కోసం దాడి చేసినా, మత మార్పిడికి కారణమయ్యే ఉద్దేశ్యంతో, మైనర్, మహిళ లేదా ఏ వ్యక్తినైనా అక్రమ రవాణా చేస్తే అది తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అలాంటి కేసుల్లో 20 ఏళ్లు జైలు కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధిస్తారు. బాధితురాలి చికిత్స ఖర్చులు, పునరావాసం కోసం కోర్టు ఆ మొత్తాన్ని జరిమానాగా నిర్ణయించగలదు. తీవ్రమైన నేరాల మాదిరిగానే,ఇప్పుడు ఎవరైనా మత మార్పిడి విషయంలో కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగలుగుతారు. ఇంతకుముందు, మత మార్పిడితో బాధపడుతున్న వ్యక్తి, అతని బంధువులు లేదా సమీప బంధువుల తరపున మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి.