Page Loader
అక్టోబర్ 1 నుంచి పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్ర 
అక్టోబర్ 1 నుంచి పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్ర

అక్టోబర్ 1 నుంచి పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్ర 

వ్రాసిన వారు Stalin
Sep 25, 2023
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడద వారాహి విజయ యాత్రకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభం కానుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ కావడం, జనసేన, టీడీపీ పొత్తు ఖరారైన తర్వాత పవన్ చేస్తున్న ఈ యాత్రకు ప్రాధాన్యత సంతరించుకున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజకీయాలు చాలా హాట్‌గా ఉన్నాయి. ఈ క్రమంలో పవన్ తన యాత్రలో ఎలాంటి అంశాలపై ప్రసంగిస్తారనేది ఆసక్తకరంగా మారింది. ప్రధానంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీఎం జగన్‌, ప్రభుత్వ విధానాలపై విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం ఉంది. ఈ యాత్రలో టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలపై కూడా పవన్ ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పవన్ యాత్రపై జనసేన ట్వీట్