Page Loader
Vasantha Krishna Prasad: టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్యెల్యే 
Vasantha Krishna Prasad: టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్యెల్యే

Vasantha Krishna Prasad: టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్యెల్యే 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2024
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

మైలవరం వైసీపీ ఎమ్యెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా శనివారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ వైసీపీపై, సీఎం వై.ఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాట ఇచ్చి మడమ తిప్పడం జగన్ కే చెల్లిందని అన్నారు. ప్రతిపక్ష నేతలను తిడితేనే వైసీపీలో పదవులు వస్తాయని చెప్పారు. తనకు మైలవరం టికెట్ ఇస్తామని కాకపోతే చంద్రబాబును,లోకేశ్ ను వ్యక్తిగతంగా దూషించాలని చెప్పారన్నారు. అందుకే, వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నట్లు చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చంద్రబాబు నివాసానికి మైలవరం ఎమ్మెల్యే