NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: పౌరుల మరణాలపై భద్రతా మండలిలో భారత్ తీవ్ర ఆందోళన 
    తదుపరి వార్తా కథనం
    ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: పౌరుల మరణాలపై భద్రతా మండలిలో భారత్ తీవ్ర ఆందోళన 
    ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: పౌరుల మరణాలపై భద్రతా మండలిలో భారత్ తీవ్ర ఆందోళన

    ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: పౌరుల మరణాలపై భద్రతా మండలిలో భారత్ తీవ్ర ఆందోళన 

    వ్రాసిన వారు Stalin
    Oct 25, 2023
    11:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గత మూడు వారాలుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరమైన యుద్ధం నడుస్తోంది. యుద్ధం వల్ల సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో యుద్ధంలో పౌరుల ప్రాణ నష్టంపై భారత్ స్పందించింది.

    గాజాలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి, పెద్ద ఎత్తున పౌర ప్రాణనష్టం గురించి భారతదేశం తీవ్ర ఆందోళన చెందుతోందని ఐక్యరాజ్య సమితిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా ఉన్న ఆర్.రవీంద్ర భద్రతా మండలిలో పేర్కొన్నారు.

    పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితిపై భద్రతా మండలిలో జరిగిన బహిరంగ చర్చలో భారత్ తరఫున రవీంద్ర మాట్లాడారు.

    అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడులు దిగ్భ్రాంతిని కలిగించాయన్నారు.

    హమాస్ దాడిలో మరణించిన వారికి మొదట సంతాపం తెలిపిన ప్రపంచ నాయకుల్లో భారత ప్రధాని మోదీ ఉన్నారన్నారు.

    భారత్

    మానవతా సాయాన్ని భారత్ కొనసాగిస్తుంది: రవీంద్ర

    గాజా స్ట్రిప్‌లోని పౌరులకు మానవతా సహాయం పంపడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను భద్రతా మండలిలో రవీంద్ర వివరించారు.

    ఇప్పటికే గాజాకు 38 టన్నుల ఆహారం, వైద్య పరికరాలను పంపినట్లు చెప్పారు.

    భారత్ ఎల్లప్పుడూ ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు చర్చలు అవసరమని భారత్ నమ్ముతున్నట్లు రవీంద్ర వెల్లడించారు.

    ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, వ్యవస్థాపకత, సమాచార సాంకేతికతతో సహా పాలస్తీనా ప్రజలకు భారతదేశం మానవతా సహాయాన్ని పంపడం కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.

    ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి న్యాయమైన, శాంతియుత, శాశ్వత పరిష్కారం సాధించడానికి భారతదేశం కట్టుబడి ఉందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐక్యరాజ్య సమితి
    హమాస్
    ఇజ్రాయెల్
    భారతదేశం

    తాజా

    AP High Court: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..  స్టే పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం హైకోర్టు
    Australia: భారత సంతతి వ్యక్తిని దారుణంగా కొట్టిన ఆస్ట్రేలియా పోలీసులు.. జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతమంటూ ఆరోపణ ఆస్ట్రేలియా
    Virat Kohli: ఐపీఎల్‌కు కోహ్లీ గుడ్‌బై చెప్పనున్నాడా..? అరుణ్ ధుమాల్ వ్యాఖ్యలతో ఊహాగానాలు! విరాట్ కోహ్లీ
    Trade deal: భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం: అమెరికా వాణిజ్య కార్యదర్శి అమెరికా

    ఐక్యరాజ్య సమితి

    భారత్‌లో హిందూ వ్యతిరేక శక్తులు నిత్యానందను వేధించాయి: 'కైలాస' రాయబారి విజయప్రియ కైలాసం
    పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు; సమర్థించిన బైడెన్ వ్లాదిమిర్ పుతిన్
    ఐపీసీసీ హెచ్చరిక; 'గ్లోబల్ వార్మింగ్‌ 1.5 డిగ్రీలు దాటుతోంది, ప్రపంచదేశాలు మేలుకోకుంటే ఉపద్రవమే' ప్రపంచం
    ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ భారతదేశం

    హమాస్

    ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం.. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు  ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి.. అమెరికా-ఇరాన్ 6 బిలియన్ డాలర్ల ఒప్పందానికి లింకేంటి? అమెరికా
    ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి వెనుక ఇరాన్‌ హస్తం  ఇజ్రాయెల్
    ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులు ఎలా ఉన్నారు? కేంద్రం ఏం చెబుతోంది?  ఇజ్రాయెల్

    ఇజ్రాయెల్

    Helpline: గాజాలోని భారతీయుల కోసం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ప్రారంభం  పాలస్తీనా
    ఆపరేషన్‌ అజయ్​ని ప్రారంభించిన భారత్.. ఇజ్రాయిల్‌ నుంచి ఇండియన్స్ తరలింపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    హమాస్‌ అణిచివేతకు ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ.. శవాల దిబ్బగ మారిన గాజా ప్రధాన మంత్రి
    హమాస్ పై ప్రధాని నెతాన్యాహు సంచలన వ్యాఖ్యలు.. ప్రతీ హమాస్ సభ్యుడు చచ్చినోడితో సమానమే హమాస్

    భారతదేశం

    2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 6శాతం.. ఎస్&పీ అంచనా  వృద్ధి రేటు
    మూడు నెలల్లో 90వేల మంది భారతీయ స్టూడెంట్స్‌కు వీసాలు జారీ చేసిన అమెరికా  అమెరికా
    భారత్‌లో గణనీయంగా పెరిగిన ఉద్యోగం చేసే మహిళలు.. కారణం భర్తలే అట మహిళ
    నిజ్జర్ హత్య విచారణకు సహకరించాలని భారత్‌ను కోరిన అమెరికా అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025