LOADING...
Heavy Rains: అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన
పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన

Heavy Rains: అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2025
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం ఉదయం వాయుగుండంగా బలపడింది భారత వాతావరణ శాఖ ప్రకారం, ఇది ఉత్తర-వాయవ్య దిశలో కదిలి మరింత బలవంతమై, తీవ్రతరమైన వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. శుక్రవారం తెల్లవారుజామున ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి దగ్గరగా గోపాల్‌పూర్, పరదీప్ పోర్ట్‌ల సమీపంలో భూభాగాన్ని దాటుతుందని అంచనా.

వివరాలు 

గురువారం రాష్ట్రంలో విస్తృత స్థాయిలో వర్షాలు

అదే సమయంలో, అరేబియా సముద్రంలో కూడా తీవ్రమైన అల్పపీడనం కొనసాగుతూ ఉంది. ఇది పశ్చిమ దిశలో కదిలి ఒక వాయుగుండంగా బలవ్వే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని వాయుగుండం బలవచ్చే ప్రభావం కారణంగా, గురువారం రాష్ట్రంలో విస్తృత స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) వెల్లడించాయి. ప్రత్యేకంగా, శ్రీకాకుళం, విజయనగరం,పార్వతీపురం మన్యం,విశాఖపట్నం, అనకాపల్లి,అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.