Loading...
CM Vijay: ప్రపంచ స్థాయి ఒలింపిక్ నగరంగా చెన్నై.. సీఎం విజయ్ కీలక ప్రకటన
ప్రపంచ స్థాయి ఒలింపిక్ నగరంగా చెన్నై.. సీఎం విజయ్ కీలక ప్రకటన

CM Vijay: ప్రపంచ స్థాయి ఒలింపిక్ నగరంగా చెన్నై.. సీఎం విజయ్ కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2026
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు రాజధాని చెన్నైను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒలింపిక్ నగరంగా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం విజయ్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను ఆయన ఆవిష్కరించారు. మొత్తం 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలను చేపట్టనున్నట్లు తెలిపారు. కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ కాంప్లెక్స్ కోసం సుమారు రూ.1,200 కోట్లను ఖర్చు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. మరోవైపు చెన్నైను మోటార్‌స్పోర్ట్స్‌కు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. భవిష్యత్తులో ఫార్ములా 1-4 రేసులకు నగరం ఆతిథ్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

వివరాలు 

ఒలింపిక్ సిటీకి అధునాతన సదుపాయాలు

తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఒలింపిక్ సిటీని అభివృద్ధి చేయనున్నారు.

ఇందులో అథ్లెట్లకు అవసరమైన అన్ని కీలక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

క్రీడా ప్రాంగణాలు, ఆధునిక క్రీడా పరికరాలు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్ కేంద్రాలను కూడా అందుబాటులో ఉంచనున్నారు.

క్రీడాకారులకు అత్యున్నత స్థాయి వసతి సదుపాయాలు కల్పించడం, నిపుణులైన కోచ్‌లను నియమించడం వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టనున్నారు.

తమిళనాడుకు చెందిన అథ్లెట్లకు అత్యాధునిక శిక్షణ, మెరుగైన మౌలిక వసతులు అందించడం ఈ ఒలింపిక్ సిటీ ప్రధాన ఉద్దేశమని సీఎంవో వెల్లడించింది.

వివరాలు 

మోటార్‌స్పోర్ట్స్ సిటీపై ప్రత్యేక దృష్టి

చెన్నై కేంద్రంగా ఫార్ములా-1 రేసులను నిర్వహించేలా ప్రత్యేక మోటార్‌స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేయాలని విజయ్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

2028 సంవత్సరం చివరి నాటికి ఫార్ములా-1 రేసింగ్‌ను భారత్‌కు తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

చెన్నైలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా ఒలింపిక్ క్రీడలతో పాటు మోటార్‌స్పోర్ట్స్‌కు కూడా నగరాన్ని కీలక వేదికగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ADVERTISEMENT