Vijay Sai Reddy: వైసీపీలో తీవ్ర మనోవేదనకు గురయ్యా.. నవంబర్ 11న కొత్త పార్టీ ప్రకటించనున్న విజయసాయిరెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీలో తాను తీవ్ర మనోవేదనకు గురైనట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్ర శ్రేయస్సే లక్ష్యంగా మూడో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 11వ తేదీన కొత్త పార్టీ పేరును వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు.
వివరాలు
ఓవీ రమణకు పార్టీలో కీలక బాధ్యతలు
టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు ఓవీ రమణ తన పార్టీలో చేరడం సంతోషంగా ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు.
కొత్త పార్టీలో ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారని వెల్లడించారు.
గతంలో తామిద్దరం టీటీడీ పాలకమండలిలో కలిసి పనిచేశామని, ఆ అనుభవంతోనే ఇప్పుడు రాజకీయాల్లోనూ కలిసి ముందుకు సాగుతామని చెప్పారు.
ఇదిలా ఉండగా, ఓవీ రమణ టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ నేపథ్యంలో రమణను విజయసాయిరెడ్డి తన పార్టీలోకి ఆహ్వానించారు.
వివరాలు
ముహూర్తంపై ట్రోల్స్‌కు విజయసాయిరెడ్డి సమాధానం
నవంబర్ 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు పార్టీని ప్రకటించనున్నట్లు విజయసాయిరెడ్డి ఇప్పటికే వెల్లడించారు.
ఈ సమయంపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌కు ఆయన స్పందించారు.
పండితులు సూచించిన ముహూర్త బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సమయాన్ని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని, ఇతరులు అనవసరంగా భావిస్తే తాను ఏమీ చేయలేనని వ్యాఖ్యానించారు.
వివరాలు
అన్ని వర్గాలకు ప్రాధాన్యం
తాను మెంటార్‌గా ఉంటూ అన్ని వర్గాల వారికి రాజకీయ అధికారం దక్కేలా కృషి చేస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు.
ప్రజల ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడో ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు తమ పార్టీలో చేరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.