Loading...
Visa overhaul: భారతీయ వీసా వ్యవస్థలో కీలక మార్పులు.. దరఖాస్తు విధానం మరింత సులభం
భారతీయ వీసా వ్యవస్థలో కీలక మార్పులు.. దరఖాస్తు విధానం మరింత సులభం

Visa overhaul: భారతీయ వీసా వ్యవస్థలో కీలక మార్పులు.. దరఖాస్తు విధానం మరింత సులభం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2026
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ వీసా విధానాన్ని మరింత వేగవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలకు సిద్ధమవుతోంది. విదేశీయులు, ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) భారత్‌కు వచ్చేందుకు వీసా దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం అమలులో ఉన్న 13 వీసా కేటగిరీలను 9కి, 49 ఉప కేటగిరీలను 23కి తగ్గించనున్నట్లు సమాచారం. వీసా దరఖాస్తు విధానాన్ని మరింత సులభంగా, వినియోగదారులకు అనుకూలంగా మార్చేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా దరఖాస్తు ఫారమ్‌లోని ఫీల్డ్స్ సంఖ్యను 70 శాతం వరకు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనివల్ల దరఖాస్తుదారులు తక్కువ సమాచారాన్ని నమోదు చేసి, సులభంగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

వివరాలు 

2027 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి..

ప్రస్తుతం అమలులో ఉన్న వీసా మాన్యువల్‌-2019 స్థానంలో కొత్త నిబంధనలతో కూడిన సవరణలను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.

వీసా విధానంలో మార్పులతో పాటు డిజిటల్ సంస్కరణలను కూడా అమలు చేయనుంది.

ఈ కొత్త వీసా నిబంధనలు, డిజిటల్ మార్పులను 2027 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ADVERTISEMENT