
Visakha Metro: ఊపందుకున్న విశాఖ మెట్రో పనులు
ఈ వార్తాకథనం ఏంటి
తాజాగా విశాఖ మెట్రో ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ విశాఖ మెట్రో కోసం జనరల్ కన్సల్టెన్సీ నియామకానికి బిడ్లను ఆహ్వానించింది.
త్వరలో దీనికి సంబంధించి ప్రీ-బిడ్ సమావేశం కూడా నిర్వహించనున్నారు.
ప్రస్తుతం ఎల్‌ఐసీ భవనంలో ఉన్న మెట్రో కార్యాలయాన్ని వీఎంఆర్‌డీఏ భవనంలోకి మారుస్తున్నారు. కూటమి ప్రభుత్వం విశాఖ మెట్రోను తక్షణమే పట్టాలెక్కించేందుకు యత్నిస్తోంది.
భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలు, ప్రయాణికుల రద్దీ లెక్కల ఆధారంగా ప్రణాళికలు రూపొందిస్తూ, ప్రతి అడ్డంకిని అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. ప్రాజెక్టుకు స్పష్టమైన రూపురేఖలు సిద్ధం చేస్తోంది.
Details
42 స్టేషన్లు ఏర్పాటే లక్ష్యంగా పనులు
విశాఖ మెట్రో మొదటి దశ ప్రాజెక్టులో మొత్తం మూడు కారిడార్లను రూపొందించనున్నారు. 46.22 కిలోమీటర్ల పొడవులో 42 స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
స్టీల్‌ప్లాంటు నుండి కొమ్మాది కూడలి వరకు 34.40 కి.మీ. దూరంలో 29 స్టేషన్లు
గురుద్వారా నుంచి పాతపోస్టాఫీసు వరకు 5.07 కి.మీ.లో 6 స్టేషన్లు
తాటిచెట్లపాలెం నుండి చినవాల్తేరుకు 6.75 కి.మీ.లో 7 స్టేషన్లు నిర్మించనున్నారు.
2026 నాటికి మొదటి దశ మెట్రో ప్రారంభమైతే, మూడు కారిడార్లలో రోజుకు సుమారు 16 వేల మంది ప్రయాణించవచ్చని అంచనా వేస్తున్నారు.
Details
అయిదు కీలక ప్రాంతాల్లో సమీకృత స్టేషన్లు నిర్మించనున్నారు
ఆ ఏడాదిలో మెట్రో ఆదాయం సుమారు రూ.590 కోట్లు ఉండొచ్చని అధికారులు లెక్కలు వేసారు. దీని ఆధారంగా 2051 నాటికి ప్రయాణికుల సంఖ్య రోజుకు 50 వేలు చేరుతుందని, ఆదాయం రూ.7,287 కోట్లకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.
ఎన్‌ఏడీ కూడలి : పెందుర్తి, కంచరపాలెం మార్గాల కలయికకు.
తాటిచెట్లపాలెం : విశాఖ రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్‌కు కనెక్టివిటీ.
గురుద్వారా కూడలి : రెండో కారిడార్ ద్వారా ఆర్టీసీ కాంప్లెక్స్‌ను చేరుకునే మార్గం.
మద్దిలపాలెం : హనుమంతువాక కారిడార్, రామాటాకీస్, ఆర్టీసీ కాంప్లెక్స్‌కు కనెక్టివిటీ.
హనుమంతువాక కూడలి : సింహాచలం బీఆర్‌టీఎస్‌తో పాటు ఆరిలోవ, హెల్త్‌సిటీ ప్రాంతాలను చేరుకునే విధంగా నిర్మాణం.
ఈ విధంగా విశాఖ మెట్రో ప్రాజెక్టు మెరుగైన ప్రణాళికతో, స్పష్టమైన లక్ష్యాలతో వేగంగా ముందుకు సాగుతోంది.