Page Loader
Russia : ప్రధాని రాక తమకు సంతోషమన్న రష్యా..మోదీ దూతగా పుతిన్'తో జైశంకర్ భేటీ
ప్రధానిని రష్యాకు ఆహ్వానించిన పుతిన్..మోదీ దూతగా పుతిన్'తో జైశంకర్ భేటీ

Russia : ప్రధాని రాక తమకు సంతోషమన్న రష్యా..మోదీ దూతగా పుతిన్'తో జైశంకర్ భేటీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 28, 2023
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్'తో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భేటీ అయ్యారు. ప్రధాని మోదీని రష్యాలో చూడటం తమకెంతో సంతోషమన్నారు పుతిన్.వ‌చ్చే ఏడాది వార్షిక స‌ద‌స్సులో మోదీ,పుతిన్ భేటీ అవుతార‌ని జైశంక‌ర్ వెల్ల‌డించారు. 5రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జైశంక‌ర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ ల‌వ్రోవ్‌ను సైతం క‌లిశారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని ప‌రిష్క‌రించేందుకు మోదీ ప్ర‌య‌త్నం చేశార‌ని పుతిన్ పేర్కొన్నారు. శాంతియుతంగా స‌హ‌క‌రిస్తున్న భార‌త్‌కు స‌మాచారాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ామన్నారు. భార‌త్‌,ర‌ష్యా మ‌ధ్య వాణిజ్య ఆదాయం పెరుగుతోంద‌ని పుతిన్ అన్నారు. వచ్చే సంవత్సరం ఇండియా బిజీ రాజకీయ షెడ్యూల్‌ కలిగి ఉంటుందని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారత్‌లోని మా స్నేహితులకు విజయం కలగాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు పుతిన్ స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రష్యా అధ్యక్షుడితో భేటీ అయిన జైశంకర్