NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
    తదుపరి వార్తా కథనం
    Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
    బిగ్ అలర్ట్, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

    Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 14, 2024
    12:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం, నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది.

    అయినప్పటికీ, ఏపీలో రేపు (నవంబర్ 14) కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

    ఈ నెల 15, 16 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

    ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఐఎండీ అంచనాలను తీసుకుని కీలక సూచనలు చేసింది.

    వర్షాలు పడే నేపథ్యంలో రైతులు వరికోతలు, ఇతర వ్యవసాయ పనులలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

    వివరాలు 

    ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన… 

    పంట పొలాల్లో నిలిచిన నీటిని త్వరగా బయటకు పోయేలా ఏర్పాటు చేసుకోవాలని, పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఆ మధ్య ఉధ్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా సపోర్టు ఇవ్వాలని సూచించింది.

    అలాగే, రేపు (నవంబర్ 14) కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

    అలాగే, అల్లూరి, కోనసీమ, పగో, ఏలూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

    వివరాలు 

    తెలంగాణలో ఇలా… 

    తెలంగాణలో, నిన్నటి వరకు పొడి వాతావరణం ఉండగా, అల్పపీడన ప్రభావం కారణంగా నవంబర్ 13 నుంచి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

    నవంబర్ 16 వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే, ఎలాంటి హెచ్చరికలు ఇవ్వలేదని తాజా బులెటిన్‌లో తెలిపింది.

    నవంబర్ 17 నుండి తెలంగాణలో మళ్లీ పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేసింది.

    హైదరాబాద్ లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండడంతో, ఉపరితల గాలులు ఈశాన్య దిశలో వీచే అవకాశం ఉందని పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వాతావరణ శాఖ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఆంధ్రప్రదేశ్

    Free gas cylinder: ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి కానుక.. 'ఉచిత గ్యాస్‌' బుకింగ్స్‌ ప్రారంభం  భారతదేశం
    Nara Lokesh: ఏపీలో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం నారా లోకేశ్‌ కసరత్తు నారా లోకేశ్
    Free Gas Cylinder eKYC: ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ఈ-కేవైసీ ప్రక్రియ.. అర్హతలు ఇవే! ప్రభుత్వం
    Free Gas Subsidy: ఏపీలో దీపావళి కానుకగా ఉచిత సిలిండర్ పథకం అమలు.. సబ్సిడీ సొమ్ము ఎలా పొందాలి? దీపావళి

    వాతావరణ శాఖ

    Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి భారీ వర్షాలు  భారతదేశం
    Heavy rains: అలర్ట్.. తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు తెలంగాణ
    Monsoon: రైతులకు వాతావరణ విభాగం బ్యాడ్ న్యూస్.. సెప్టెంబర్‌ నెలాఖరు వరకు వర్షాలు   వాతావరణ మార్పులు
    AP Rains: అలర్ట్.. రానున్న మూడ్రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025