
New India-PM Modi-Pakistan: ఇది సరికొత్త భారత్...పాక్ పప్పులుడకట్లేదు: ప్రధాని నరేంద్రమోదీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశ భద్రతపై కాంగ్రెస్(congress)అనుసరించిన విధానాలను ప్రధాని నరేంద్ర మోడీ(Naredra Modi)తీవ్రంగా విమర్శించారు.
భారత్ లో గతంలో ఉగ్రదాడులు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ వేదికపై ఏడ్చేదని ఇప్పుడు మోదీ వచ్చాక పాకిస్తాన్ ఏడుస్తుందని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్ఖండ్(Jarkhand)లోని పలాములో ప్రధాని మోడీ మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు పిరికిపందల్లా ప్రపంచ వేదికలపై ఉగ్రవాద దాడుల గురించి ఏడ్చేవని చెప్పారు .
ఇప్పుడు మోడీ వచ్చాక ఆ ప్రపంచ వేదికలపై భారత ఏడ్చే రోజులు పోయాయని ఇప్పుడు పాకిస్తాన్ సహాయం కోసం ప్రపంచ వేదికలపై ఏడుస్తుందని పెడబొబ్బలు పెడుతుందని తెలిపారు.
దేశ సరిహద్దుల్లో కాపలా కాసేందుకు వెళ్లిన మన జవాన్లు ప్రాణాలు కోల్పోయేవారని ఇప్పుడు కొత్త దేశంలో వచ్చిందని గతంలోలా పరిస్థితి లేదన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
आज पाकिस्तान के नेता, कांग्रेस के शहजादे को पीएम बनाने के लिए दुआ कर रहे हैं।
— BJP (@BJP4India) May 4, 2024
लेकिन मजबूत भारत तो अब मजबूत सरकार ही चाहता है... पूरा हिन्दुस्तान कह रहा है मजबूत भारत के लिए मजबूत सरकार... मजबूत सरकार के लिए मोदी सरकार।
- प्रधानमंत्री श्री @narendramodi
पूरा वीडियो देखें :… pic.twitter.com/YRn72VfArs