Tejas aircraft crash: రాజస్థాన్‌లో కుప్పకూలిన తేజస్ విమానం
భారత వైమానిక దళానికి చెందిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) తేజస్ శిక్షణా విమానం మంగళవారం రాజస్థాన్ జైసల్మేర్ సమీపంలో కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. అదే సమయంలో ప్రమాదానికి గల కారణాలను కనుగొనడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి భారత వైమానిక దళం ఆదేశించింది. జైసల్మేర్‌లోని జవహర్ కాలనీ సమీపంలో మేఘవాల్ హాస్టల్ భవనం సమీపంలో తేజస్ పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పైలట్, కో-పైలట్ తేజస్ విమానంలో ఉన్నారు. అగ్నిమాపక దళం వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.