
Heavy Rain: ఏపీలో విస్తృత వర్షాలు.. విశాఖ సహా ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరప్రాంతంపై అల్పపీడనం కొనసాగుతున్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరో 24 గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఈ నెల 19న దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర మధ్య తీర ప్రాంతాన్ని దాటవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ భారతి సవ్వడి తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
Details
ఈ జిల్లాలాకు ఆరెంజ్ అలర్ట్
ఇప్పటికే విశాఖపట్నం, అనకాపల్లి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు ప్రకటించారు. అదే సమయంలో, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చినట్లు వెల్లడించారు.