Page Loader
MNS- BJP: మహారాష్ట్రలో కొత్త పొత్తులు.. బీజేపీ కూటమిలోకి రాజ్ థాకరే పార్టీ! 
MNS- BJP: మహారాష్ట్రలో కొత్త పొత్తులు.. బీజేపీ కూటమిలోకి రాజ్ థాకరే పార్టీ!

MNS- BJP: మహారాష్ట్రలో కొత్త పొత్తులు.. బీజేపీ కూటమిలోకి రాజ్ థాకరే పార్టీ! 

వ్రాసిన వారు Stalin
Feb 07, 2024
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ ఎన్నికల వేళ.. మహారాష్ట్రలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. రాజ్ థాకరే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS) పార్టీ.. బీజేపీ కూటమిలో చేరేందుకు చర్చలు జరుపుతోంది. ఈ మేరకు మంగళవారం ఎంఎన్ఎస్ నేతలు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకంపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు ఇండియా టుడే టీవీ వర్గాలు తెలిపాయి. సీట్ల పంపకంపై బీజేపీ నేతలతో చర్చించే బాధ్యతలను ఎంఎన్ఎస్ నేతలు బాలా నంద్‌గావ్కర్, సందీప్ దేశ్‌పాండే, నితిన్ సర్దేశాయ్‌లను రాజ్ థాకరే అప్పగించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 48 లోక్‌సభ స్థానాలు, 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎంఎన్ఎస్- బీజేపీ మధ్య సీట్ల పంపకంపై చర్చలు