Kesineni Nani: టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: కేశినేని నాని సంచనల కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టిక్కెట్‌ను సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నానికి కాకుండా మరొకరికి ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీని వీడేందుకు ఎంపీ కేశినేని నాని సిద్ధమయ్యారు. తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన వల్ల ఉపయోగం లేదని భావించిన తర్వాత తాను టీడీపీలో కొనసాగడం సరికాదన్నారు.
త్వరలోనే తాను లోక్‌సభ స్పీకర్‌ను కలుస్తానని, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
అలాగే వెంటనే టీడీపీకి కూడా రాజీనామా చేస్తానని ట్వీట్ చేశారు.
నాని
నాని తమ్ముడు చిన్నికి చంద్రబాబు ప్రాధాన్యం
కేశినేని నాని టీడీపీ నాయకత్వం కొంతకాలంగా దూరంగా పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
నానిని పక్కన పెట్టి ఆయన తమ్ముడు శివనాథ్ (చిన్ని) అధినేత చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో తనను పక్కన పెట్టి.. తన తమ్ముడికి ప్రాధాన్యత ఇవ్వడంపై నాని అవకాశం వచ్చినప్పుడల్లా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.
కానీ చంద్రబాబు పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో కొంతకాలంగా కేశినేని నాని పార్టీ కార్యక్రమాలనకు దూరంగా ఉంటున్నారు.
విజయవాడ నుంచి 2014, 2019లో వరుసగా రెండుసార్లు ఎంపీగా కేశినేని నాని గెలుపొందారు.
అయితే టీడీపీకి రాజీనామా చేసి.. ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తికరంగా మారింది.