
మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పుడు ఆమోదించినా.. అమల్లోకి వచ్చేది 2029లోనే.. ఎందుకో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారడానికి ఒక అడుగు దురంలోనే ఉంది. ఈ బిల్లు చట్టంగా మారితే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కానుంది.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు ఆమోదం పొందినా, తక్షణమే అమల్లోకి రావడానికి అవకాశం లేదు.
2029లోనే మహిళ రిజర్వేషన్ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎన్డీటీవీ నివేదిక చెబుతోంది.
మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే, అంతకంటే ముందు రెండు అత్యంత కీలక ఘట్టాలను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బిల్లు
జన గణన, డీలిమిటేషన్ తర్వాతే..
మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటే అంతకంటే ముందు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
జనాభా గణనను 2021లో నిర్వహించాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా ఆలస్యమైంది, కాబట్టి తదుపరి గణన 2027లో ఉండే అవకాశం ఉంది.
2027లో జనాభా గణన నిర్వహించిన తర్వాత, డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ తర్వాత మహిళా రిజర్వషన్లు అమలవుతాయి.
అంటే 33శాతం మహిళా రిజర్వేషన్ల కోసం 2029వరకు వేచి చూడాల్సిందే.
ఒక్కమాటలో చెప్పాలంటే 2024లో జరిగే ఎన్నికల్లో రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం ఉండదు.